‘దేశంలో ఎవరూ చేయని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు’

ABN , First Publish Date - 2021-05-30T16:16:37+05:30 IST

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖ నగరంలోని పార్టీ కార్యాలయంలో వైసీపీ నేతలు జెండా ఆవిష్కరణ చేశారు

‘దేశంలో ఎవరూ చేయని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు’

విశాఖపట్నం : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖ నగరంలోని పార్టీ కార్యాలయంలో వైసీపీ నేతలు జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ ముఖ్యనేత, పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ మాట్లాడుతూ.. దేశంలో ఎవరూ చేయని సంక్షేమ, అభివృద్ధి పథకాలను జగన్ అమలు చేస్తున్నారని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించారని, విశాఖ అభివృద్ధిలో ఎంపీ విజయసాయిరెడ్డి కీలక పాత్ర వహిస్తున్నారని పేర్కొన్నారు. ముడసరలోవ పార్క్ విషయంలో జనసేన నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆ పార్క్‌ను అంతర్జాతీయ పార్క్‌గా తీర్చిదిద్దుతామని వంశీ చెప్పుకొచ్చారు. కాగా.. ముడసర్లోవ పార్కును పీపీపీ (పబ్లిక్‌-ప్రైవేటు పార్టనర్‌షిప్‌) పద్ధతిలో అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనపై రాజకీయ దుమారం రేపుతున్న విషయం విదితమే.

Updated Date - 2021-05-30T16:16:37+05:30 IST