రక్షణ రంగ పరిశోధనల్లో ఏయూకి భాగస్వామ్యం

ABN , First Publish Date - 2021-08-21T09:01:59+05:30 IST

రక్షణ రంగ పరిశోధనల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తగిన

రక్షణ రంగ పరిశోధనల్లో ఏయూకి భాగస్వామ్యం

డీఆర్‌డీవో చైర్మన్‌ డాక్టర్‌ సతీశ్‌ రెడ్డి


ఏయూ క్యాంపస్‌ (విశాఖపట్నం), ఆగస్టు 20: రక్షణ రంగ పరిశోధనల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తగిన భాగస్వామ్యం, ప్రాధాన్యం కల్పిస్తామని డీఆర్‌డీవో చైర్మన్‌ డాక్టర్‌ జి.సతీశ్‌ రెడ్డి ప్రకటించారు. ఏయూ అకడమిక్‌ సెనేట్‌ హాల్‌లో శుక్రవారం ఆయన ఆచార్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏయూలో నెలకొల్పే ఫుడ్‌ రిసెర్చ్‌ ల్యాబ్‌, ఇంక్యుబేషన్‌ కేంద్రాలతో కలిసి పనిచేస్తామన్నారు.


మైసూర్‌లోని తమ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌తో అవగాహన ఒప్పందం చేసుకోవాలని కోరారు. దీనికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని డీఆర్‌డీవో అందిస్తుందన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ రంగాల్లోనూ పరిశోధనల భాగస్వామ్యం అవసరమని సతీశ్‌రెడ్డి చెప్పారు. బెంగళూరు, ఢిల్లీలోని తమ ప్రయోగశాలలతో కలిసి పనిచేస్తూ, పరిష్కారాలు చూపాలని సూచించారు. 


Updated Date - 2021-08-21T09:01:59+05:30 IST