సాధారణ బదిలీలపై పాక్షికంగా నిషేధం ఎత్తివేత
ABN , First Publish Date - 2021-12-07T02:21:50+05:30 IST
సాధారణ బదిలీలపై పాక్షికంగా నిషేధం ఎత్తివేస్తూ ప్రభుత్వం

అమరావతి: సాధారణ బదిలీలపై పాక్షికంగా నిషేధం ఎత్తివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2022 జనవరి 4 తేదీ వరకూ ఉద్యోగుల పరస్పర బదిలీలకు అంగీకరిస్తూ ఆదేశాలిచ్చింది. ఉమ్మడి బదిలీలకు నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది. మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ వరకూ మాత్రమే సాధారణ బదిలీలపై నిషేధం సడలిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పరస్పర బదిలీ కోరుతున్న ఉద్యోగులు ఒకే చోట కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. ఏసీబీ, విజిలెన్సు కేసులు ఇతర అభియోగాలున్న ఉద్యోగుల బదిలీ దరఖాస్తును పరిశీలించబోమని ప్రభుత్వం తెలిపింది.