దౌర్జన్యంగా మార్కెట్‌ను ధ్వంసం చేశారు : పరిటాల శ్రీరామ్

ABN , First Publish Date - 2021-10-25T18:11:42+05:30 IST

అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. ధర్మవరం కూరగాయల మార్కెట్ కూల్చివేతపై పబ్లిక్ హియరింగ్ పెట్టాలన్నారు. తెల్లవారుజామున కూరగాయల మార్కెట్ కూల్చివేయడంమేంటని ప్రశ్నించారు.

దౌర్జన్యంగా మార్కెట్‌ను ధ్వంసం చేశారు : పరిటాల శ్రీరామ్

అనంతపురం: అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. ధర్మవరం కూరగాయల మార్కెట్ కూల్చివేతపై పబ్లిక్ హియరింగ్ పెట్టాలన్నారు. తెల్లవారుజామున కూరగాయల మార్కెట్ కూల్చివేయడంమేంటని ప్రశ్నించారు. కూరగాయల వ్యాపారులను బెదిరింపులకు గురి చేసి దౌర్జన్యంగా మార్కెట్‌ను ధ్వంసం చేశారని పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన కూరగాయల వ్యాపారులకు పరిహారం చెల్లించాలన్నారు. రెండు కోట్ల రూపాయల వరకూ కూరగాయల వ్యాపారులకు అధికారుల తీరు వల్ల నష్టం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ ధర్మవరం మార్కెట్ యార్డ్ కూల్చివేతపై జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మార్కెట్ కూల్చివేతలో జోక్యం చేసుకున్న వైసీపీ నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ ధర్మవరం ఎమ్మెల్యే ఇంట్లో పనిమనిషిలా కాకుండా కమిషనర్‌లా పని చేయాలని పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు.

Updated Date - 2021-10-25T18:11:42+05:30 IST