పోలీసుల నోటీసులకు సమాధానం ఇవ్వని పరిటాల సిద్ధార్థ!

ABN , First Publish Date - 2021-08-21T22:08:20+05:30 IST

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్‌స్టేషన్‌లో పరిటాల సిద్ధార్థ విచారణ ముగిసింది. మరోసారి హాజరుకావాలని పరిటాల సిద్ధార్థను ఆదేశించారు.

పోలీసుల నోటీసులకు సమాధానం ఇవ్వని పరిటాల సిద్ధార్థ!

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్‌స్టేషన్‌లో పరిటాల సిద్ధార్థ విచారణ  ముగిసింది. మరోసారి హాజరుకావాలని పరిటాల సిద్ధార్థను ఆదేశించారు. పోలీసుల నోటీసులకు సిద్ధార్థ సరైన సమాధానం ఇవ్వలేదనే ప్రచారం జరుగుతోంది. ఉన్నతాధికారుల సలహాతో ఎయిర్ పోర్ట్ పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకొనున్నారు. దీంతో మరో మారు హాజరు కావాల్సి ఉంటుందని సిద్ధార్థను పోలీసు ఆదేశించారు. ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో సిద్ధార్థ బ్యాగులో 5.56 క్యాలిబర్ బుల్లెట్ పోలీసులకు దొరికింది. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి శ్రీనగర్‌కు సిద్ధార్థ వెళ్తుండగా సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు తనిఖీ చేసినపుడు బ్యాగులో బుల్లెట్‌ ఉన్నట్టు కనుగొన్నారు. కాగా బ్యాగులో బుల్లెట్‌ ఉందని, దానికి అవసరమైన పత్రాలు లేవని తనకు తెలియదని సిద్ధార్థ చెప్పినట్టు సమాచారం. ఆయనపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి, వివరణ ఇవ్వాలని నోటీసులిచ్చారు.  

Updated Date - 2021-08-21T22:08:20+05:30 IST