హిందువుల పండుగలంటే జగన్‌కి చిన్నచూపు: పరిపూర్ణానంద

ABN , First Publish Date - 2021-12-24T20:58:11+05:30 IST

సీఎం జగన్‌రెడ్డిపై స్వామి పరిపూర్ణానంద తీవ్ర విమర్శలు గుప్పించారు.

హిందువుల పండుగలంటే జగన్‌కి చిన్నచూపు: పరిపూర్ణానంద

అమరావతి: సీఎం జగన్‌రెడ్డిపై స్వామి పరిపూర్ణానంద తీవ్ర విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..గతంలో డెల్టా పేరుతో పండుగలపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టిందన్నారు.ఒమైక్రాన్ దృష్ట్యా క్రిస్మస్‌పై ఎందుకు ఆంక్షలు పెట్టడం లేదని ప్రశ్నించారు. హిందువుల పండుగలపైనే జగన్‌కి కరోనా గుర్తుకువస్తుందా అని నిలదీశారు. హిందువుల పండుగలంటే జగన్‌కి చిన్నచూపన్నారు. ఏపీలో పథకం ప్రకారం ఆలయాలపై దాడులు చేశారని మండిపడ్డారు. అంతర్వేది ఘటనా నిందితులను ఇప్పటికీ పట్టుకోలేదని చెప్పారు. పింక్ డైమండ్ అని ఎన్నికల ముందు అభూత కల్పన సృష్టించారన్నారు.నిజంగా పింక్ డైమండ్ ఉందా లేదా తేల్చాలని ప్రశ్నించారు. టీటీడీకి నిధులు కావాలంటే వేరే మార్గాలు ఎంచుకోవాలన్నారు. స్వామి మీద ప్రయోగాలు చేయడం తగదన్నాదు.దేవుడి సేవలు అని చెప్పి డబ్బు సంపాదించడం మానేయాలని హితవు పలికారు. టీటీడీ లక్ష్యం వేదాన్ని రక్షించడమేనని పరిపూర్ణానంద తెలిపారు. 

Updated Date - 2021-12-24T20:58:11+05:30 IST