సర్పంచ్ బరిలో ఏపీ స్పీకర్ తమ్మినేని సతీమణి

ABN , First Publish Date - 2021-02-08T20:10:53+05:30 IST

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణి సర్పంచ్‌గా నామినేషన్ దాఖలు చేశారు.

సర్పంచ్ బరిలో ఏపీ స్పీకర్ తమ్మినేని సతీమణి

శ్రీకాకుళం జిల్లా: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణి సర్పంచ్‌గా నామినేషన్ దాఖలు చేశారు. ఆముదాలవలస మండలం తొగరాం పంచాయతీ సర్పంచ్ అభ్యర్ధిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తొగరాం స్వగ్రామం కావడంతో సర్పంచ్ ఎన్నికను స్పీకర్ తమ్మినేని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అలాగే టీడీపీ బలపరిచిన అభ్యర్థి తమ్మినేని భారతమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నిక అనివార్యం కావటంతో ఏకగ్రీవం కోసం తమ్మినేని చేసిన ప్రయత్నం విఫలమైంది.

Updated Date - 2021-02-08T20:10:53+05:30 IST