పంచాయతీ ఎన్నికలపై పబ్లిక్ ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2021-01-25T16:30:00+05:30 IST

ఏపీ ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం సోమవారం నామినేషన్ల ప్రక్రియ..

పంచాయతీ ఎన్నికలపై పబ్లిక్ ఏమన్నారంటే..

కృష్ణాజిల్లా: ఏపీ ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా ఇంత వరకు రెవిన్యూ డివిజన్లలో ఎక్కడా ఎటువంటి ఏర్పాట్లు జరగలేదు. ఈ సందర్భంగా నూజివీడులో పబ్లిక్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఎన్నికలకు సన్నద్ధంగా ఉన్నామని, ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయోనని ఎదురు చూస్తున్నామన్నారు. నామినేషన్లు వేయడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే పంచాయతీ ఆఫీసు తెరవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో మహిళ మాట్లాడుతూ తాను ఎంపీటీసీగా పోటీ చేద్దామని అనుకున్నానని, అయితే కరోనా ఉందని ఎన్నికలు నిలిపివేశారని, ఇప్పుడు కరోనా తగ్గిందని.. ఎస్ఈసీ ఎన్నికలు జరపడానికి సన్నాహాలు చేస్తున్నా.. జగన్ ప్రభుత్వం ముందుకు రావడంలేని మండిపడ్డారు. ఇప్పటికే ఆలస్యమైందని, ఎన్నికలు జరపాలని కోరుతున్నారు. ప్రభుత్వం కావాలనే ఎన్నికలు జరగకుండా చేస్తోందని విమర్శించారు.

Updated Date - 2021-01-25T16:30:00+05:30 IST