కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పల్నాడు కవి కృష్ణమూర్తి మృతి

ABN , First Publish Date - 2021-09-03T09:06:43+05:30 IST

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, కవి, రచయిత చిట్టిప్రోలు కృష్ణమూర్తి (89) గురువారం తుదిశ్వాస విడిచారు.

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పల్నాడు కవి కృష్ణమూర్తి మృతి

దాచేపల్లి, సెప్టెంబరు 2: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, కవి, రచయిత చిట్టిప్రోలు కృష్ణమూర్తి (89) గురువారం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని కుమారుడి వద్ద ఉంటున్న ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి పల్నాడు కవిగా పేరుపొందారు. 2011లో ‘పురుషోత్తముడు’ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. మాఘమేఘములు, మహిష శతకం తదితరాలను సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించారు. ఈయన రాసిన కైకేయి ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులకు పరిశీలనా గ్రంథంగా ఎంపికయింది. సాకేతం పేరుతో రామాయణ మహాకావ్యాన్ని రచించారు.

Updated Date - 2021-09-03T09:06:43+05:30 IST