రైతులకు అణా పైసల వరకు చెల్లిస్తాం: బొత్స

ABN , First Publish Date - 2021-11-05T19:25:34+05:30 IST

రైతులకు అణా పైసల వరకు చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఎన్‌సీఎస్‌ షుగర్‌ ఫ్యాక్టరీపై బొత్స సమీక్ష నిర్వహించారు.

రైతులకు అణా పైసల వరకు చెల్లిస్తాం: బొత్స

విజయనగరం: రైతులకు అణా పైసల వరకు చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఎన్‌సీఎస్‌ షుగర్‌ ఫ్యాక్టరీపై బొత్స సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆందోళన చేస్తున్న రైతుల వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. దాదాపు 80 వేల ఎకరాల్లో సాగుచేసిన చెరకు కొనుగోలు చేయాలన్నారు. రైతులకు చెల్లించాల్సింది కేవలం రూ.6 కోట్లేనని బొత్స సత్యనారాయణ తెలిపారు.


ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగార యాజమాన్యం తీరుపై రైతులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. రెండు క్రషింగ్‌ సీజన్‌లకు సంబంధించిన రూ.16.33 కోట్ల బకాయిలను ఎన్‌సీఎస్‌ యాజమాన్యం రైతులకు చెల్లించడం లేదు. దీనిపై ఎప్పటికప్పుడు హామీలు ఇవ్వడమే తప్ప కార్యాచరణ కనిపించలేదు. దీంతో విసుగెత్తిన రైతులంతా పోరాటానికి దిగారు. రైతులకు వామపక్షపార్టీలు, జనసేన పార్టీలు రైతులకు మద్దతు ప్రకటించారు.


Updated Date - 2021-11-05T19:25:34+05:30 IST