ఒడిసా నుంచి ఆక్సిజన్‌

ABN , First Publish Date - 2021-05-02T08:09:35+05:30 IST

ఒడిసాలోని అంగూల్‌ నుంచి 46 టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ను తీసుకొచ్చేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు చేపట్టింది. గన్నవరం విమానాశ్రయం నుంచి ఆర్మీకి చెందిన కార్గో విమానంలో రెండు ఖాళీ ట్యాంకర్లను

ఒడిసా నుంచి ఆక్సిజన్‌

ఆర్మీ కార్గో విమానంలో 2 ఖాళీ ట్యాంకర్ల తరలింపు 

అంగూల్‌ నుంచి రోడ్డు మార్గంలో రాష్ట్రానికి.. వాటికోసం గ్రీన్‌చానల్‌ ఏర్పాటు

ఆక్సిజన్‌ సరఫరా పెంచుదాం.. 10 క్రయోజనిక్‌ ట్యాంకర్ల కొనుగోలుకు నిర్ణయం

సింగపూర్‌ నుంచి దిగుమతికి సీఎం ఓకే.. 600 టన్నులు ఇవ్వండి: కేంద్రానికి విజ్ఞప్తి 


అమరావతి(ఆంధ్రజ్యోతి)/గన్నవరం, మే 1: ఒడిసాలోని అంగూల్‌ నుంచి 46 టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ను తీసుకొచ్చేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు చేపట్టింది. గన్నవరం విమానాశ్రయం నుంచి ఆర్మీకి చెందిన కార్గో విమానంలో రెండు ఖాళీ ట్యాంకర్లను శనివారం అంగూల్‌కు తరలించింది. అక్కడ ఆక్సిజన్‌ నింపుకొని అవి రహదారి మార్గంలో ఏపీకి వస్తాయి. రెండు రోజుల వ్యవధిలోనే అవి గమ్యస్థానానికి చేరుకునేలా, ట్రాఫిక్‌ సమస్యలు ఎదురుకాకుండా గ్రీన్‌చానెల్‌ ఏర్పాటు చేసినట్లు ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. రోజుకు రెండు లేదా రెండు రోజుల్లో నాలుగు ట్యాంకర్లను కార్గో విమానాల ద్వారా అక్కడికి తరంచి, గ్రీన్‌చానెల్‌ ద్వారా వాటిని ఏపీకి తీసుకొస్తామని వివరించారు. 

Updated Date - 2021-05-02T08:09:35+05:30 IST