‘ప్రాణం మీదకు ఓటీఎస్’పై హల్‌చల్‌

ABN , First Publish Date - 2021-12-07T07:40:00+05:30 IST

‘ప్రాణం మీదకు ఓటీఎస్‌’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి‘లో ప్రచురితమైన కథనంపై విజయనగరం జిల్లా బొబ్బిలి అధికార యంత్రాంగం హల్‌చల్‌ చేసింది....

‘ప్రాణం మీదకు  ఓటీఎస్’పై హల్‌చల్‌

భారతి ఇంటికి అధికారులు, పోలీసులు

ఎమ్మెల్యే సమక్షానికి రావాలని పిలుపు

ఇంటిపై రుణమంటేనే కట్టానని వివరణ

ప్రాణం మీదకు ఓటీఎ్‌స’పై హల్‌చల్‌ 

 భారతి ఇంటికి అధికారులు, పోలీసులు

 ఎమ్మెల్యే సమక్షానికి రావాలని పిలుపు

 ఇంటిపై రుణమంటేనే కట్టానని వివరణ 


బొబ్బిలి రూరల్‌, డిసెంబరు 6: ‘ప్రాణం మీదకు ఓటీఎస్‌’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి‘లో ప్రచురితమైన కథనంపై విజయనగరం జిల్లా బొబ్బిలి అధికార యంత్రాంగం హల్‌చల్‌ చేసింది. సోమవారం ఉదయమే మున్సిపల్‌ సిబ్బంది పొట్నూరు భారతి, శ్రీనివాసరావు నివాసానికి చేరుకున్నారు. పోలీసులు సైతం వెళ్లడం గమనార్హం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి భారతిని రప్పించారు. ఎమెల్యే, పార్టీ నాయకులు, హౌసింగ్‌ అఽఽధికారుల సమక్షంలో ఆమెను మాట్లాడాలని కోరారు. భారతి బిక్కుబిక్కుమంటూ తాను స్వచ్ఛందంగానే ఓటీఎ్‌సకు డబ్బులు చెల్లించానని, తనపై ఎవరూ ఒత్తిడి తీసుకురాలేదని చెప్పారు. ఇంటిపై తనకు శాశ్వత హక్కు వస్తుందని, మళ్లీ రుణం ఇస్తారని సిబ్బంది నచ్చజెప్పడంతో పొదుపు సంఘం నుంచి డబ్బులు తీసుకొని కట్టినట్లు వివరించారు. ముందురోజు సీపీఎం నాయకుడి సమక్షంలో ఎందుకలా చెప్పారని విలేకరులు ప్రశ్నించగా, ఆమె తడబడుతూ మాట్లాడలేకపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మంచి సంకల్పంతో ప్రవేశపెట్టిన ఓటీఎ్‌సపై తెలుగుదేశం, వామపక్షాలు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు.   కాగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన కొడుకుకు వైద్యం చేయించుకునేందుకు పొదుపు సంఘం నుంచి తీసుకున్న రుణం సొమ్మును, సచివాలయ ఉద్యోగులు ఒత్తిడి చేసి ఓటీఎ్‌సకు జమ చేసుకున్నారని ముందురోజు ఆదివారం ఆమె చెప్పడం గమనార్హం. 

Updated Date - 2021-12-07T07:40:00+05:30 IST