దొంగ పట్టాలు, ఇళ్ల లబ్ధిదారుల కోసమే ఓటీఎస్‌

ABN , First Publish Date - 2021-12-25T08:28:52+05:30 IST

దొంగ పట్టాలు, దొంగ ఇళ్లతో బితుకుబితుకుమంటూ కాలం గడిపేవారికి మోక్షం కలిగించేందుకే ప్రభుత్వం ఓటీఎ్‌సను ప్రవేశపెట్టిందని విజయనగరం జిల్లా బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు వ్యాఖ్యానించారు.

దొంగ పట్టాలు, ఇళ్ల లబ్ధిదారుల కోసమే ఓటీఎస్‌

వైసీపీ ఎమ్మెల్యే శంబంగి 

బొబ్బిలి రూరల్‌, డిసెంబరు 24: దొంగ పట్టాలు, దొంగ ఇళ్లతో బితుకుబితుకుమంటూ కాలం గడిపేవారికి మోక్షం కలిగించేందుకే ప్రభుత్వం ఓటీఎస్‌ను ప్రవేశపెట్టిందని విజయనగరం జిల్లా బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో లబ్ధిదారులకు సంపూర్ణ గృహ హక్కు పత్రాలు అందించే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా లబ్ధిదారులు దర్జాగా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పారు. 

Updated Date - 2021-12-25T08:28:52+05:30 IST