మహిళల ఆర్థిక ప్రయోజనాల కోసమే..

ABN , First Publish Date - 2021-12-30T08:10:09+05:30 IST

పేదల కష్టాన్ని దోపిడీ చేస్తున్న జగన్‌ బ్యాచ్‌ తీరును ఎండ గట్టేందుకే చీప్‌ లిక్కర్‌ ధరల గురించి మాట్లాడానంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వివరణ ఇచ్చారు.

మహిళల ఆర్థిక ప్రయోజనాల కోసమే..

‘చీప్‌’ వ్యాఖ్యలపై సోము వీర్రాజు వివరణ

అమరావతి, విజయవాడ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పేదల కష్టాన్ని దోపిడీ చేస్తున్న జగన్‌ బ్యాచ్‌ తీరును ఎండ గట్టేందుకే చీప్‌ లిక్కర్‌ ధరల గురించి మాట్లాడానంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వివరణ ఇచ్చారు. మద్యం సేవించే వాళ్లు రోజూచేసే రూ.250 ఖర్చులో రూ.200 తగ్గితే ఆ కుటుంబంపై భారం తగ్గి సోదరీమణులకు ప్రతి నెలా రూ.6వేలు ఆదా అవుతుందని నిర్వచించారు. ప్రజాఆగ్రహ సభలో తాను చేసిన వ్యాఖ్యలతోపాటు రాష్ట్రంలోని పలు పార్టీల నేతల కామెంట్లకు ఆయన బుధవారం కౌంటర్‌ ఇచ్చారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు రాత్రుల్లో ఎక్కువై ఉదయం నోరు మడత పడుతోందంటూ ఎద్దేవా చేశారు. బొత్స సత్యనారాయణ పవర్‌ పాలిటిక్స్‌లోకి మారే మొబైల్‌ పొలిటీషియన్‌ అన్నారు. మంత్రి కొడాలి నాని చేతికి దారాలు తప్ప తలలో మెదడు లేదన్నారు. లీజుల గురించి మాట్లాడితే వైసీపీ నేతలకు చొక్కాలు ఊడుతాయన్న విషయం మరో మంత్రి పేర్ని నాని తెలుసుకోవాలని హెచ్చరించారు. మమ్మల్ని జగన్‌ పార్టీ అంటోన్న పయ్యావుల నిజం తెలుసు కోవాలని అన్నారు. కమ్యూనిస్టులపై మరోసారి తనదైన శైలిలో అడుక్కొనే పార్టీ అంటూ వ్యాఖ్యానించారు. భారతీయుల చందాలతో బతుకుతూ చైనా, రష్యా కోసం ఆలోచించే వ్యక్తులని ఆరోపించారు.  రాష్ట్రంలో ఇతర పరిశ్రమల విక్రయంపై పవన్‌ కల్యాణ్‌ పోరాటం చేయాలన్న మాటలో తప్పులేదన్నారు.

Updated Date - 2021-12-30T08:10:09+05:30 IST