ఆన్‌లైన్‌లో ప్రజాభిప్రాయ సేకరణ: ఏపీఈఆర్‌సీ
ABN , First Publish Date - 2021-01-12T08:34:08+05:30 IST
విద్యుత్ పంపిణీ సంస్థల ధరల ప్రతిపాదనలపై ఈసారి ప్రజాభిప్రాయ సేకరణను ఆన్‌లైన్ ద్వారా తీసుకోవాలని విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) నిర్ణయించిందని ఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మి సెల్వమణి తెలిపారు.

విశాఖపట్నం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): విద్యుత్ పంపిణీ సంస్థల ధరల ప్రతిపాదనలపై ఈసారి ప్రజాభిప్రాయ సేకరణను ఆన్‌లైన్ ద్వారా తీసుకోవాలని విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) నిర్ణయించిందని ఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మి సెల్వమణి తెలిపారు. విశాఖ కార్పొరేట్ కార్యాలయం లో ఇందుకోసం జరుగుతున్న ఏర్పాట్లను ఆమె సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నాగలక్ష్మి మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ప్రజాభిప్రాయాలను వీడియో సమావేశాల ద్వారా స్వీకరించనున్నట్టు చెప్పారు.