మరోసారి బెదిరింపులకు పాల్పడిన ఎమ్మెల్యే కన్నబాబు

ABN , First Publish Date - 2021-02-07T00:25:08+05:30 IST

ఎమ్మెల్యే కన్నబాబురాజు మరోసారి బెదిరింపులకు పాల్పడ్డారు. రాంబిల్లి మండలం కోడూరులో పార్టీ సమావేశం నిర్వహించారు.

మరోసారి బెదిరింపులకు పాల్పడిన ఎమ్మెల్యే కన్నబాబు

విశాఖ: ఎమ్మెల్యే కన్నబాబురాజు మరోసారి బెదిరింపులకు పాల్పడ్డారు. రాంబిల్లి మండలం కోడూరులో పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ‘‘మీ గ్రామంలో వైసీపీ అభ్యర్థిని గెలిపించకపోతే.. మీరు ఎన్ని సార్లు తిరిగినా ఏమీ రావు. నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు సంక్షేమ పథకాలు సీఎం జగన్ తర్వాత ఇచ్చేది నేనే. గెలిచినా, ఓడినా, సర్పంచ్ మాత్రం వైసీపీ అభ్యర్థే. అవతల పార్టీ అభ్యర్థిగా గెలిచిన కుర్చీలో కూడా కూర్చొనివ్వం. ఇది గుర్తు పెట్టుకొని వైసీపీ అభ్యర్థులు గెలిపించాలి’’ అని స్టేషన్ బెయిల్ తీసుకుని వచ్చిన అనంతరం, ఏర్పాటుచేసిన సమావేశంలో కన్నబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. 


కొద్దిసేపటి క్రితం స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న వార్డు మెంబర్ అభ్యర్థి అల్లుడిని బెదిరించిన కేసులో రాంబిల్లి పోలీసులు కన్నబాబును అరెస్ట్ చేశారు. అనంతరం స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలిపెట్టారు. వార్డు మెంబర్ అభ్యర్థి అల్లుడికి ఫోన్ చేసి కన్నబాబు బెదిరించారు. ఈ ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కన్నబాబుపై వివిధ సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-02-07T00:25:08+05:30 IST