రాష్ట్రంలో మరో ఇద్దరికి ఒమైక్రాన్‌

ABN , First Publish Date - 2021-12-26T09:00:58+05:30 IST

రాష్ట్రంలో మరో ఇద్దరికి ఒమైక్రాన్‌

రాష్ట్రంలో మరో ఇద్దరికి ఒమైక్రాన్‌

అమరావతి, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా మరో రెండు ఒమైక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఒమైక్రాన్‌ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. తాజాగా ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ఒక్కో కేసు బయటపడినట్టు ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ హైమావతి శనివారం ప్రకటించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి(48) ఈనెల 16న దక్షిణాఫ్రికా నుంచి విమానంలో హైదరాబాద్‌ వచ్చి, రోడ్డుమార్గంలో ఒంగోలు చేరుకున్నారు. 19న ఆయనకు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయగా, పాజిటివ్‌ వచ్చింది. 20న శాంపిల్‌ను హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపించగా, ఒమైక్రాన్‌గా నిర్ధారించింది. అలాగే, అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి(51) ఈనెల 18న యూకే నుంచి విమానంలో బెంగళూరు వచ్చి, రోడ్డు మార్గంలో అనంతపురం చేరుకున్నారు. 20 ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయగా పాజిటివ్‌ నిర్ధారణైంది. సీసీఎంబీకి శాంపిల్‌ను పంపగా ఒమైక్రాన్‌ నిర్ధారణైంది. ఇద్దరికీ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని హైమావతి తెలిపారు. 

Updated Date - 2021-12-26T09:00:58+05:30 IST