అంతర్వేది వద్ద కిలోమీటరు మేర వెనక్కి తగ్గిన సముద్ర కెరటాలు

ABN , First Publish Date - 2021-08-25T23:35:33+05:30 IST

ఏపీలో తీరప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంతర్వేది వద్ద కిలోమీటరు మేర సముద్ర కెరటాలు వెనక్కి తగ్గాయి.

అంతర్వేది వద్ద కిలోమీటరు మేర వెనక్కి తగ్గిన సముద్ర కెరటాలు

రాజమండ్రి: ఏపీలో తీరప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంతర్వేది వద్ద కిలోమీటరు మేర సముద్ర కెరటాలు వెనక్కి తగ్గాయి. రాజోలుకు 257 కిలోమీటర్ల దూరంలో నిన్న బంగాళాఖాతంలో భూకంపం ఏర్పడింది. సముద్రంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం ఏర్పడింది. భూకంప తీవ్రత వల్ల సముద్రం వెనక్కి వెళ్ళిందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భూకంప ప్రభావం కాదని జియో ఇంజనీరింగ్ విభాగం అధికారులు చెబుతున్నారు. పౌర్ణమి రోజున సాధారణమేనని మత్స్యకారులు, స్థానికులు అంటున్నారు.


బంగాళాఖాతంలో మంగళవారం సంభవించిన భూకంపం జిల్లా ప్రజలను ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేసింది. ఎప్పుడూలేని రీతిలో కాకినాడ, రాజోలు తీర ప్రాంతాల నుంచి 300లోపు కిలోమీటర్ల పరిధిలో సముద్ర గర్భంలో చోటుచేసుకున్న ప్రకంపనలు అలజడి రేపాయి. సమాచారం తెలుసుకున్న తీర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ముప్పు ఎటువైపు వస్తుందోనని ఆందోళన చెందారు. అయితే స్వల్ప సమయమే ప్రకంపనలు చోటుచేసుకుని అని తర్వాత సద్దుమణగడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 




Updated Date - 2021-08-25T23:35:33+05:30 IST