చట్టసభల్లో ఓబీసీలకు 33 శాతం రిజర్వేషన్లు

ABN , First Publish Date - 2021-02-26T08:56:16+05:30 IST

దేశంలో ఓబీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ ఓబీసీ సెల్‌ జాతీయ కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ ప్రకాశ్‌ సోనువానే డిమాండ్‌ చేశారు...

చట్టసభల్లో ఓబీసీలకు 33 శాతం రిజర్వేషన్లు

  • కాంగ్రెస్‌ జాతీయ ఓబీసీ సెల్‌ డిమాండ్‌


విజయవాడ, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): దేశంలో ఓబీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ ఓబీసీ సెల్‌ జాతీయ కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ ప్రకాశ్‌ సోనువానే డిమాండ్‌ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, కౌన్సిల్‌ సభ్యుల పదవుల్లో ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ఓబీసీ సెల్‌ కార్యవర్గ సమావేశం విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో గురువారం జరిగింది. అనంతరం రాష్ట్ర ఓబీసీ విభాగం చైర్మన్‌ నులుకుర్తి వెంకటేశ్వరరావుతో కలిసి ప్రకాశ్‌ మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలోని చట్టసభల్లో ఈ రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని, వెంటనే ఏపీలోనూ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-02-26T08:56:16+05:30 IST