3 వర్సిటీల వీసీ పోస్టులకు నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2021-05-02T08:34:47+05:30 IST

రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్సలర్‌ పోస్టుల భర్తీ కోసం ఉన్నత విద్యా శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జేఎన్‌టీయూకే (కాకినాడ), విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (నెల్లూరు), డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌

3 వర్సిటీల వీసీ పోస్టులకు నోటిఫికేషన్‌

ఈ నెల 21 వరకు దరఖాస్తులకు గడువు


అమరావతి, మే 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్సలర్‌ పోస్టుల భర్తీ కోసం ఉన్నత విద్యా శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జేఎన్‌టీయూకే (కాకినాడ), విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (నెల్లూరు), డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ యూనివర్సిటీ (కర్నూలు)లలో వీసీల నియామకానికి  దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా బయోడేటా, దరఖాస్తులను వివిధ డాక్యుమెంట్లతో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయానికి పంపాలని కోరింది. నీలాద్రి టవర్స్‌ (3,4,5 అంతస్థులు), శ్రీరామ్‌ నగర్‌, 6వ బెటాలియన్‌ రోడ్‌, ఆత్మకూర్‌, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా అనే చిరునామాకు పంపాలని పేర్కొంది. మరిన్ని వివరాల కోసం www.apsc-he.org వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.

Updated Date - 2021-05-02T08:34:47+05:30 IST