‘పాలిటెక్నిక్’ ప్రవేశాలకు నోటిఫికేషన్
ABN , First Publish Date - 2021-09-30T09:29:55+05:30 IST
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో .
ఫీజు చెల్లించేందుకు రేపటి నుంచి 6 వరకు గడువు
3 నుంచి 8వ తేదీ వరకు ఆప్షన్ల నమోదు
11న సీట్ల కేటాయింపు.. 18 నుంచి తరగతులు
మొత్తం 70,249 సీట్లు: సాంకేతిక విద్య కమిషనర్ భాస్కర్
అమరావతి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో మొత్తం 70,249 సీట్లు ఉన్నాయని సాంకేతిక విద్య కమిషనర్ పోలా భాస్కర్ బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు అక్టోబరు ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు గడువు ఉందన్నారు. 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేస్తామని చెప్పారు. వివిధ కోర్సులకు ఆప్షన్ల నమోదుకు 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అవకాశం ఇచ్చామన్నారు. 11వ తేదీన సీట్లు కేటాయిస్తామని, 18వ తేదీ నుంచి కళాశాలలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలోని 173 ఎయిడెడ్, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో 53,423 సీట్లు, 84 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 17,004 సీట్లు ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాలు పెంపొందింపచేసేలా కొత్త కోర్సులు ప్రవేశపెట్టామని, మరింత సమాచారం అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 31 హెల్ప్‌డె్‌స్కలను ఏర్పాటు చేశామని వివరించారు. కన్వీనర్ ఏపీపాలిసెట్ వెబ్‌సైట్ లో మరిన్ని వివరాలుంటాయని, 8106876345, 7995865456 ఫోన్ నంబర్లలోనూ సంప్రదించవచ్చని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో కార్యదర్శి కె.విజయభాస్కర్, జేడీ ఎ.నిర్మల్‌కుమార్ పాల్గొన్నారు.