తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
ABN , First Publish Date - 2021-03-24T10:09:17+05:30 IST
తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నామినేషన్ల ఘట్టం

అమరావతి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నామినేషన్ల ఘట్టం మొదలైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) కె.విజయానంద్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. నామినేషన్ల దాఖలుకు చివరి గడువు ఈ నెల 30వ తేదీ. 31న వాటిని పరిశీలిస్తారు. ఉపసంహరణకు ఏప్రిల్ 3వరకు గడువు ఉంది. ఏప్రిల్ 17న పోలింగ్, మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితం ప్రకటిస్తారు. మే 4తో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.