దేవినేని ఉమకి నోటీసులిస్తాం: డీఎస్పీ సత్యానందం
ABN , First Publish Date - 2021-01-21T01:10:22+05:30 IST
గుడివాడ టూటౌన్ ఎస్ఐ విజయ్‌కుమార్ మృతిపై టీడీపీ నేత దేవినేని ఉమ వ్యాఖ్యలను డీఎస్పీ సత్యానందం కొట్టిపారేశారు.

విజయవాడ: గుడివాడ టూటౌన్ ఎస్ఐ విజయ్‌కుమార్ మృతిపై టీడీపీ నేత దేవినేని ఉమ వ్యాఖ్యలను డీఎస్పీ సత్యానందం కొట్టిపారేశారు. విజయ్‌కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని డీఎస్పీ తెలిపారు. విజయ్‌కుమార్ మృతిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అయితే పేకాట దాడుల నిర్వహణలో ఒత్తిడిలకు తట్టుకోలేక మృతిచెందాడని దేవినేని ఉమ అనడం అవాస్తవమన్నారు. ఆధారాలు చూపించాలని దేవినేని ఉమకి నోటీసులు జారీ చేస్తామని డీఎస్పీ సత్యానందం తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన పిల్లి విజయ్‌కుమార్ గుడివాడ టూటౌన్ ఎస్ఐగా కొద్దినెలల కిత్రం బాధ్యతలు చేపట్టారు. స్టేషన్‌కు సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఆయనకు 2020 నవంబరులో వివాహమైంది. సోమవారం అర్ధరాత్రి దాటాక అపార్ట్ మెంట్లో విజయకుమార్ ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసులో విజయ్‌కుమార్ ప్రియురాలు సురేఖపై సెక్షన్ 306 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తన సోదరుడు ఆత్మహత్యకు సురేఖనే కారణమంటూ విజయ్ కుమార్ తమ్ముడు విక్రమ్ ఫిర్యాదు చేశాడు. విచారణ అనంతరం సురేఖను అరెస్ట్ చేశారు.