ఆర్టీసీ ఎన్నికల్లో ఎన్‌ఎంయూ కూటమి విజయం
ABN , First Publish Date - 2021-12-15T07:55:40+05:30 IST
ఆర్టీసీ ఎన్నికల్లో ఎన్‌ఎంయూ కూటమి విజయం

అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ సీసీఎస్ ఎన్నికల్లో ఎన్‌ఎంయూ కూటమి విజయభేరి మోగించింది. రాష్ట్రవ్యాప్తంగా 210 డెలిగేట్ స్థానాలకు మంగళవారం జరిగిన పోలింగ్‌లో 50 వేల మంది సిబ్బంది ఓటేశారు. ఎన్‌ఎంయూ-ఎ్‌సడబ్ల్యూఎఫ్ కూటమికి మెజారిటీ కట్టబెట్టారు. ఎన్‌ఎంయూ కూటమికి 114 స్థానాలు దక్కగా ఈయూ కూటమికి 96 స్థానాలు దక్కాయి. టెక్నికల్ విద్య, వైద్యం, వాహన లోన్లు ఇస్తామని హామీ ఇచ్చిన ఎన్‌ఎంయూ కూటమివైపు సిబ్బంది మొగ్గు చూపారు. అయితే, బలమైన యూనియన్‌తో పొత్తు పెట్టుకున్నా సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో వైఎస్సార్ అసోసియేషన్ బలపరిచిన అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఆర్టీసీ చైర్మన్ అదే జిల్లాకు చెందిన వ్యక్తి అయినా తన పరిధిలోని డిపోలో వైసీపీ అభ్యర్థిని గెలిపించుకోలేక పోయారనే విమర్శలు వస్తున్నాయి. తాజా ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్‌ఎంయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం, యాజమాన్యం సహకారంతో హామీలు నెరవేరుస్తామన్నారు. సీసీఎ్‌సను బలోపేతం చేసి తమపై నమ్మకం ఉంచిన ఓటర్లకు న్యాయం చేస్తామని చెప్పారు.