నీతి ఆయోగ్‌ సీఈవోకు చేదు అనుభవం!

ABN , First Publish Date - 2021-08-20T08:21:15+05:30 IST

నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌కు విశాఖలో చేదు అనుభవం ఎదురైంది.

నీతి ఆయోగ్‌ సీఈవోకు   చేదు అనుభవం!

రోడ్డుపై ఉక్కుకార్మికుల బైఠాయింపు 

మరో మార్గంలో వెళ్లిపోయిన సీఈవో 

ఉక్కుటౌన్‌షిప్‌ (విశాఖపట్నం), ఆగస్టు 19: నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌కు విశాఖలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన స్టీల్‌ప్లాంట్‌ మార్గంలో మెడ్‌టెక్‌ జోన్‌కు వెళతారనే సమాచారం అందడంతో గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ఉక్కు కార్మికులు రహదారులన్నీ దిగ్బంధించారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు, నిర్వాసితులు అంతా కలిసి హిల్‌టాప్‌ గెస్ట్‌హౌస్‌ జంక్షన్‌కు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. ‘సేవ్‌ స్టీల్‌ప్లాంట్‌’ ప్లకార్డులు పట్టుకొని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మరో మార్గంలో నీతి ఆయోగ్‌ సీఈవో మెడ్‌టెక్‌ జోన్‌కు వెళ్లినట్టు తెలిసింది. ప్లాంట్‌ పరిరక్షణ కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని, ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఈ సందర్భంగా కమిటీ నాయకులు పేర్కొన్నారు. కేంద్రం తరఫున విశాఖలో ఎవరు అడుగుపెట్టినా అడ్డుకుంటామన్నారు.

Updated Date - 2021-08-20T08:21:15+05:30 IST