మంత్రి పెద్దిరెడ్డి హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారా?

ABN , First Publish Date - 2021-02-07T01:34:13+05:30 IST

ఏపీలో అధికార పార్టీ నేతల మాటలు శృతిమించుతున్నాయి. పాలకులు ఇలా ఉంటారా? అనే ఏహ్య భావం కలిగే స్థాయిలో మాటల దాడి కొనసాగుతోంది. కొంతమందికి...

మంత్రి పెద్దిరెడ్డి హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారా?

అమరావతి: ఏపీలో అధికార పార్టీ నేతల మాటలు శృతిమించుతున్నాయి. పాలకులు ఇలా ఉంటారా? అనే ఏహ్య భావం కలిగే స్థాయిలో మాటల దాడి కొనసాగుతోంది. కొంతమందికి అధికారులు, కొన్ని నిర్ణయాలు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఎన్నికల కమిషన్‌కు, ప్రభుత్వానికి  మధ్య జరుగుతున్న మాటల యుద్ధం రోజురోజుకు పెరుగుతూనే ఉంది తప్ప ఫుల్‌స్టాప్ పడటంలేదు. మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్టీలు, పలు సంఘాలు రోడ్డెక్కాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ‘‘మంత్రి పెద్దిరెడ్డి హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారా?. రాష్ట్ర మంత్రిని కంట్రోల్ చేసే అధికారం ఎస్ఈసీకి ఉంటుందా?. ఐఏఎస్, ఐపీఎస్‌లను పెద్దిరెడ్డి బెదిరించడం అధికార దుర్వినియోగం కాదా?. విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణ ఉద్యమం ఎటు దారి తీస్తోంది?. గంటా మోగించిన రాజీనామా గంట ప్రతిధ్వనిస్తోందా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 

Updated Date - 2021-02-07T01:34:13+05:30 IST