నిమ్మగడ్డ నియంతలా వ్యవహరిస్తున్నారు: మంత్రి శంకర్ నారాయణ
ABN , First Publish Date - 2021-02-06T18:12:16+05:30 IST
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ నియంతలా వ్యవహరిస్తున్నారని రోడ్లు భవనాల

అనంతపురం: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ నియంతలా వ్యవహరిస్తున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ ఎస్ఈసీపై ధ్వజమెత్తారు. జిల్లాలోని పెనుకొండలో 50 పడకల ఆసుపత్రి పునర్ నిర్మాణ పనులకు భూమి పూజను మంత్రి నారాయణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగపరంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషనర్ దిగజారుడు వ్యవహారాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
స్థానికక సంస్థల ఎన్నికలలో గ్రామపంచాయతీలను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే వాటిని కూడా తప్పుబట్టే స్థాయిలో ఎన్నికల కమిషనర్ ఉన్నారని మంత్రి శంకర్ నారాయణ ఆరోపించారు.
