తెలంగాణ కంటే మెరుగైన పీఆర్సీ ఇవ్వాలి
ABN , First Publish Date - 2021-03-24T09:46:26+05:30 IST
తెలంగాణ కంటే మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని ఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కడప జిల్లా రైల్వేకోడూరులో

ఉక్కు ప్రైవేటీకరణపై ఉద్యమిస్తాం: చంద్రశేఖర్‌రెడ్డి
రైల్వేకోడూరు, మార్చి 23: తెలంగాణ కంటే మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని ఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కడప జిల్లా రైల్వేకోడూరులో మంగళవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 30శాతం పీఆర్‌సీ ఇచ్చారని, ఆంధ్రాలో అంతకంటే ఎక్కువగా ఇవ్వాలని సీఎం జగన్‌ను కోరామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఉద్యోగుల ఉద్యమానికి అండగా ఉంటామని చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు.