కొత్తగా 25,909 మందికి వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-02-06T09:41:05+05:30 IST

రాష్ట్రంలో కొత్తగా 25,909 మందికి ఆరోగ్యశాఖ వ్యాక్సిన్‌ అందించింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 1,062 వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

కొత్తగా 25,909 మందికి వ్యాక్సిన్‌

అమరావతి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా 25,909 మందికి ఆరోగ్యశాఖ వ్యాక్సిన్‌ అందించింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 1,062 వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో 954 కేంద్రాల ద్వారా 3,117 మంది హెల్త్‌కేర్‌ వర్కర్లకు, 19,902మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు కొవిషిల్డ్‌ వ్యాక్సిన్‌ అందించారు. దీంతోపాటు 108 కేంద్రాల ద్వారా 1,138 మంది హెల్త్‌కేర్‌ వర్కర్లకు, 1,752 మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ వేశారు. మొత్తంగా ఒక్కరోజులో దాదాపు 26వేల మందికి ఆరోగ్యశాఖ వ్యాక్సిన్‌ అందించింది. 

Updated Date - 2021-02-06T09:41:05+05:30 IST