కొత్తగా 3,166 కేసులు.. 21 మంది మృతి
ABN , First Publish Date - 2021-07-08T08:04:05+05:30 IST
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 83,885 శాంపిల్స్‌ను పరీక్షించగా 3,166 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని

అమరావతి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 83,885 శాంపిల్స్‌ను పరీక్షించగా 3,166 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, కరోనాతో 21మంది చనిపోయారని వైద్యఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 19,11,231కి, మరణాల సంఖ్య 12,919కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,356 యాక్టివ్ కేసులున్నాయి.