కొత్తగా 183 కొవిడ్ కేసులు.. ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-11-26T08:55:40+05:30 IST
కొత్తగా 183 కొవిడ్ కేసులు.. ఒకరి మృతి

అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గత 24గంటల్లో 30,863 మందికి కొవిడ్ పరీక్షలు జరపగా, కొత్తగా 183 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 30, అతి తక్కువగా విజయనగరం జిల్లాలో ఒక కేసు నమోదైంది. కొవిడ్‌తో కృష్ణా జిల్లాలో మరోకరు మృతి చెందారని వైద్య ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది.