కొత్తగా 175 కేసులు

ABN , First Publish Date - 2021-03-14T09:32:53+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 175 మంది కరోనా బారినపడ్డారు. మరో ఇద్దరు వైర్‌సతో మరణించారు. గత 24 గంటల వ్యవధిలో 40,448 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా..

కొత్తగా 175 కేసులు

 కరోనాతో ఇద్దరి మృతి


అమరావతి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 175 మంది కరోనా బారినపడ్డారు. మరో ఇద్దరు వైర్‌సతో మరణించారు. గత 24 గంటల వ్యవధిలో 40,448 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 175 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు శనివారం ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 40 కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరిలో 31, కృష్ణాలో 24, విశాఖపట్నంలో 20, గుంటూరులో 15 కేసులు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 8,91,563 మంది కరోనా బారినపడ్డారు. ఇందులో 8,83,113 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 132 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1268 మంది కరోనాతో   చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనాతో మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 7182కు పెరిగింది. 

అనపర్తిలో కరోనా కలకలం 

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో నాలుగు కరోనా కేసులు బయటపడ్డాయి. పాతవూరిలోని సంపత్‌ వినాయకుని ఆలయం సమీపంలో ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ రావడంతో అధికారులు ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. రెడ్‌జోన్‌ బోర్డు ఏర్పాటు చేసి పరిసరాలలో బ్లీచింగ్‌ చల్లించి ఆ ప్రాంతవాసులను అప్రమత్తం చేశారు. 

Updated Date - 2021-03-14T09:32:53+05:30 IST