కొత్తగా 162 కేసులు

ABN , First Publish Date - 2021-12-30T07:49:56+05:30 IST

గడచిన 24 గంటల్లో 31,734 శాంపిల్స్‌ పరీక్షించగా 162 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం బులెటిన్‌ విడుదల చేసింది.

కొత్తగా 162 కేసులు


కరోనా మరణాలు నిల్‌

అమరావతి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): గడచిన 24 గంటల్లో 31,734 శాంపిల్స్‌ పరీక్షించగా 162 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం బులెటిన్‌ విడుదల చేసింది. 13 జిల్లాల్లో కరోనాతో ఎవరూ చనిపోలేదని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 2076849 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో రాష్ట్రంలో మొత్తం 14492 మంది మృత్యువాతపడ్డారు. 2061308 మంది కోలుకోగా, ప్రస్తుతం 1049 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,12,62,099 సాంపిల్స్‌ని పరీక్షించినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. 

Updated Date - 2021-12-30T07:49:56+05:30 IST