టీటీడీ బోర్డులోకి కొత్త సభ్యుడు

ABN , First Publish Date - 2021-10-21T09:40:44+05:30 IST

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలిలో మరో కొత్త సభ్యుడి నియామకం జరిగింది. తమిళనాడుకు చెందిన వి. కృష్ణమూర్తిని సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

టీటీడీ బోర్డులోకి కొత్త సభ్యుడు

ప్రశాంతిరెడ్డితో రాజీనామా చేయించి కృష్ణమూర్తికి చోటు

తిరుమల, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలిలో మరో కొత్త సభ్యుడి నియామకం జరిగింది. తమిళనాడుకు చెందిన వి. కృష్ణమూర్తిని సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్థానంలో ఈ నియామకం చేపట్టినట్టు తెలిపింది. టీడీపీ హయాంలోను, గత పాలకమండలిలోను ఈయన బోర్డు సభ్యుడిగా ఉన్నారు.

Updated Date - 2021-10-21T09:40:44+05:30 IST