ఏపీలో కొత్తగా 64 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-02-01T22:57:13+05:30 IST

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య క్రమంగా తగ్గతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 64 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 64 కరోనా కేసులు నమోదు

అమరావతి: రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య  క్రమంగా తగ్గతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 64 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈరోజు నమోదైన కేసులతో కలిపి ఏపీలో 8,87,900కి కరోనా కేసులు చేరాయి. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 7,154 మంది మృతిచెందారు. ప్రస్తుతం ఏపీలో 1,242 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 8,79,504మంది రికవరీ అయ్యారు. సోమవారం కరోనాతో ఒకరు మృతిచెందారు. కరోనా తీవ్రత తగ్గినప్పటికీ విధిగా మాస్కులు శానిటైజర్లు వాడాలని వైద్యులు సూచించారు. కరోనా పట్ల నిర్లక్ష్యం వహించొద్దని వైద్యులు హెచ్చరించారు. 

Updated Date - 2021-02-01T22:57:13+05:30 IST