కనుపర్తిపాడు వివాదంపై విచారణ చేస్తున్నాం: డీఎస్పీ

ABN , First Publish Date - 2021-10-29T03:10:36+05:30 IST

జిల్లాలోని కనుపర్తిపాడు భూముల వివాదంపై విచారణ చేస్తున్నామని

కనుపర్తిపాడు వివాదంపై విచారణ చేస్తున్నాం: డీఎస్పీ

నెల్లూరు: జిల్లాలోని కనుపర్తిపాడు భూముల వివాదంపై విచారణ చేస్తున్నామని రూరల్ డీఎస్పీ హరినాధ్‌రెడ్డి తెలిపారు. తమ భూమిలోకి కొందరు ప్రవేశించి ఫ్లెక్సీలు పెట్టారని బిరదవోలు విద్య ఫిర్యాదు చేసారని డీఎస్పీ పేర్కొన్నారు. దళితుల దగ్గర భూములకి సంబంధించిన పత్రాలు ఉంటే కోర్టులో తేల్చుకోవాలని సూచిస్తామని డీఎస్పీ తెలిపారు. లేనిపక్షంలో కేసు నమోదు చేస్తామని రూరల్ డీఎస్పీ హరినాధ్‌రెడ్డి పేర్కొన్నారు. 


 జిల్లాలోని నెల్లూరు రూరల్ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఓ స్థల వివాదంలో అకారణంగా తమ వారిపై పోలీసులు దాడి చేశారంటూ కనుపర్తిపాడుకి చెందిన పలువురు దళితులు ఆందోళన చేసారు. పోలీసు సిబ్బందిపై దాడికి ప్రయత్నం చేసారు. పీఎస్‌లోకి ఆందోళనకారులు చొచ్చుకెళ్లారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.  


Updated Date - 2021-10-29T03:10:36+05:30 IST