రేయ్‌ లోకి...పగిలిపోద్ది

ABN , First Publish Date - 2021-10-21T08:45:58+05:30 IST

‘‘రేయ్‌ లోకి.. పగిలిపోద్ది. పప్పుగా.. చిత్తూరులో నీ అబ్బ పుట్టి ఉంటే.. నీది రాయలసీమ పౌరుషం అయితే రా..

రేయ్‌ లోకి...పగిలిపోద్ది

  • పప్పుగా..నీ అబ్బ చిత్తూరులో పుడితే నీది సీమ పౌరుషం అయితే రారా...
  • ఇష్టం వచ్చినట్టు తిడితే చర్మం వలిచేస్తాం
  • లోకేశ్‌పై మంత్రి అనీల్‌ దూషణపర్వం


నెల్లూరు (జడ్పి) అక్టోబరు 20 :  ‘‘రేయ్‌ లోకి.. పగిలిపోద్ది. పప్పుగా.. చిత్తూరులో నీ అబ్బ పుట్టి ఉంటే.. నీది రాయలసీమ పౌరుషం అయితే రా.. తేల్చుకుందాం... పత్రికల్లో ప్రకటనలు వద్దు. నెల్లూరులో వారం ఉంటా... కాన్వాయ్‌ను పక్కనపెడతా. ఒంటరిగానే తిరుగుతా... నువ్వొస్తావో.. నెల్లూరులో వాగిన నీ చెంచాలు, కుక్కలొస్తాయో రండి.. తేల్చుకుందాం’’ అంటూ టీడీపీ నేత నారా లోకేశ్‌పై మంత్రి అనీల్‌కుమార్‌ యాదవ్‌ పరుష వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో బుధవారం ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన... టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌లను తీవ్ర పదజాలంతో దూషించారు. ‘‘సీఎంను నోటికొచ్చినట్టు తిట్టిస్తున్నా ఓపికపట్టాం. మొన్న ఒకడితో నా కొడకా అని తిట్టించారు. ఇప్పుడు ఓ లఫూట్‌గాడితో బోష్‌డీకే అని బూతులు తిట్టించారు. మీరు తిడుతూ మమ్మల్ని బూతుల మంత్రులు అంటారా!? అని ప్రశ్నించారు. సీఎంను తిడితే కార్యకర్తలు ఆవేశానికి గురి కారా అని ఆగ్రహించారు. ‘‘మావారి రెక్కలు విరిచి రాష్ట్రాన్ని దాటిస్తామని లోకి మాట్లాడాడు. (లోకేశ్‌ను ఉద్దేశించి) దమ్ముంటే రా..’’ అంటూ అనీల్‌ సవాల్‌ విసిరారు. జగన్‌ను ఇష్టం వచ్చినట్టు తిడితే చర్మం వలిచేస్తామని మంత్రి హెచ్చరించారు. సీఎంను బూతులు తిడితే ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్టు కాదా అని పవన్‌ కల్యాణ్‌ని ప్రశ్నించారు.

Updated Date - 2021-10-21T08:45:58+05:30 IST