విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-11-26T13:21:56+05:30 IST
స్థానిక రాయల్‌ఢాబా సమీపంలో ఉన్న గదిలో గురువారం ఓ యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. దొరవారిసత్రం మండలం నెల్లూరుపల్లికి చెందిన

నెల్లూరు: స్థానిక రాయల్‌ఢాబా సమీపంలో ఉన్న గదిలో గురువారం ఓ యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. దొరవారిసత్రం మండలం నెల్లూరుపల్లికి చెందిన కాలూరు ప్రకాష్ (20)ఎక్స్‌కవేటర్ అసిస్టెంట్ ఆపరేటర్‌గా పనిచేస్తుంటాడు. గ్రామంలో అద్దె గదిలో ఉంటున్న ప్రకాష్ ఉతికిన దుస్తులు ఆరేసుకుంటుండగా, అవి పక్కనే ఉన్న ఇనుపచువ్వలకు తగిలాయి. వాటిలో విద్యుత్ ప్రసారమవుతుండడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ. ఉమాశంకర్ తెలిపారు.