ఇంత పచ్చిగా అక్రమాలా?

ABN , First Publish Date - 2021-11-09T07:54:56+05:30 IST

నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలను తక్షణం నిలిపివేయాలని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

ఇంత పచ్చిగా అక్రమాలా?

ఆ అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు

బాబు హెచ్చరిక... నీలం సాహ్నికి ఫోన్‌

అమరావతి, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలను తక్షణం నిలిపివేయాలని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినా బరిలో మిగిలిన అభ్యర్థుల పేర్లను ప్రకటించకపోవడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఆ గడువు ముగిసిన ఐదు నిమిషాల్లో రంగంలో మిగిలిన అభ్యర్థుల పేర్లు ప్రకటించాలి. కానీ రాత్రి ఏడు గంటలైనా ఆ జాబితా విడుదల చేయలేదు. ఎవరైనా కోర్టుకు వెళ్తారన్న భయంతోనే ఏకగ్రీవమయ్యారని చెబుతున్న అభ్యర్థులకు అప్పటికప్పుడు డిక్లరేషన్‌ పత్రాలు కూడా ఇచ్చేశారు. మిగిలిన డివిజన్లలో నామినేషన్లు తిరస్కరించడానికి మార్గాలు వెతకడానికి సమయం తీసుకుంటున్నారు. ఇంత పచ్చిగా అక్రమాలకు పాల్పడడాన్ని మొదటిసారి చూస్తున్నా ం. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు కాలి చెప్పుతో కాలరాస్తున్నారు’ అని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ప్రజాస్వామ్య ప్రక్రియపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా నెల్లూరు ఎన్నికను నిలిపివేసి, సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. నామినేషన్‌ వేసిన ప్రతి అభ్యర్థి పత్రాలను చెక్‌ లిస్ట్‌తో సహా జిల్లా కలెక్టర్‌కు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు మెయిల్‌లో పంపామన్నారు. అయినా కొన్ని డివిజన్లలో నామినేషన్లను తిరస్కరించారని ఆక్షేపించారు. ‘ఏ కారణంతో తిరస్కరించారో చెప్పాలని.. ఆ నామినేషన్‌ ఫారాలు బయటపెట్టాలని కోరాం. ఆ పని చేయకుండా ఊరకే తిరస్కరించేసి చేతులు దులుపుకొన్నారు. కొందరు అధికారులు ఎన్నికలను ఫార్సుగా మారుస్తుంటే పట్టించుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషనర్‌కు లే దా? మేం ప్రతి సందర్భంలో అన్నీఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్‌ నేతలు నెల్లూరులోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. అయినా కొంతమంది అవినీతి అధికారులు లెక్క లేకుండా ప్రవర్తిస్తున్నారు. వారిని వదిలిపెడతామని అనుకోవద్దు. ఒక ఉన్మాది చెబితే అధికారులు ఇష్టానుసారం చేస్తారా? గూం డాలు, రౌడీల చేతిలో ప్రజాస్వామ్యాన్ని పెట్టి ఊరుకుంటారా? రాష్ట్రాన్ని తగలబెట్టాలని అనుకుంటున్నారా? ఇంత నీచమైన ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు. ప్రజలు ఎల్లకాలం తలవంచుకుని  భరిస్తారని అనుకోవద్దు. తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంది’ అని హెచ్చరించారు. 


పోరాటం మాకు కొత్త కాదు..

‘నీచమైన వ్యక్తులను, వారి చర్యలను చూసు ్తన్నాం. మాకు పోరాటం కొత్త కాదు. ప్రజాస్వామ్య పరిరక్షణకు దేశంలోనే అతిపెద్ద పోరాటం చేసిన చరిత్ర మాకుంది. వీళ్లను, వీళ్లకు తొత్తుల్లా వ్యవహరిస్తున్న వారిని వదిలిపెట్టం’ అని చంద్రబాబు తేల్చిచెప్పారు.

Updated Date - 2021-11-09T07:54:56+05:30 IST