పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన ప్రేమజంట

ABN , First Publish Date - 2021-12-26T21:21:33+05:30 IST

నెల్లూరు జిల్లాలో ఓ ప్రేమ జంట వ్యవహారం పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది.

పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన ప్రేమజంట

నెల్లూరు: జిల్లాలో ఓ ప్రేమ జంట వ్యవహారం పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. కడప జిల్లా, ప్రొద్దుటూరుకు చెందిన నిఖిల్ రెడ్డి, నెల్లూరు జిల్లా కోటకు చెందిన సాయి లక్ష్మి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి పెళ్లికి సాయిలక్ష్మి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ప్రేమికులిద్దరూ పరారయ్యారు. అయితే తమ కుమార్తెను నిఖిల్ రెడ్డి, అతని స్నేహితులు కిడ్నాప్ చేశారంటూ యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు కారులో వచ్చిన వారిని ఛేజ్ చేసి గూడూరు వద్ద అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే నిఖిల్‌రెడ్డి ఆ యువతిని తీసుకొని పరారయ్యాడు. కారులో ఉన్న అతడి నలుగురు స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకొని కోట పోలీస్‌ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. కాగా సాయి లక్ష్మి, నిఖిల్ రెడ్డితోపాటు అతని తల్లిదండ్రుల ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-12-26T21:21:33+05:30 IST