నెల్లూరు జిల్లాలో భారీ వర్షం
ABN , First Publish Date - 2021-11-28T21:14:44+05:30 IST
నెల్లూరు: జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఆత్మకూరు, వెంకటగిరి, ఉదయగిరి పరిసర ప్రాంతాల్లో...

నెల్లూరు: జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఆత్మకూరు, వెంకటగిరి, ఉదయగిరి పరిసర ప్రాంతాల్లో రాత్రి నుంచి ఏకధాటిగా కుండపోత వాన కురిసింది. ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు, కేజర్ల, సంఘం మండలాల్లో దంచికొడుతోంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదల నుంచి ఇప్పడిప్పుడే తేరుకుంటున్న ప్రజలు.. మళ్లీ వర్ష బీభత్సం సృష్టించడంతో ఆందోళనలో ఉన్నారు. తిరుపతిలో కూడా ఆదివారం ఉదయం నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.