కన్నబాబు, అంబటిపై ఎన్‌బీడబ్ల్యూ రీకాల్
ABN , First Publish Date - 2021-10-21T11:04:19+05:30 IST
ఏపీ మంత్రి కురసాల కన్నబాబు, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై గతంలో జారీ చేసిన నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను నాంపల్లి(హైదరాబాద్)లోని ప్రజాప్రతినిధుల కోర్టు రీకాల్ చేసింది.

హైదరాబాద్, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): ఏపీ మంత్రి కురసాల కన్నబాబు, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై గతంలో జారీ చేసిన నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను నాంపల్లి(హైదరాబాద్)లోని ప్రజాప్రతినిధుల కోర్టు రీకాల్ చేసింది. హెరిటేజ్ సంస్థ వేసిన పరువు నష్టం కేసులో విచారణకు హాజరు కానందున గతంలో వీరిపై ఆ వారెంట్‌ను కోర్టు జారీ చేసింది. బుధవారం విచారణకు హాజరైన వీరిద్దరూ ప్రత్యేక అధికారిక కార్యక్రమాల వల్ల గతంలో విచారణకు హాజరు కాలేకపోయామని కోర్టుకు తెలిపారు. నాన్ బెయిలబుల్ వారెంట్‌ను వెనక్కి తీసుకోవాలని అభ్యర్థించారు. దీంతో ఎన్‌బీడబ్ల్యూను రీకాల్ చేస్తున్నట్టు కోర్టు తెలిపింది. తదుపరి విచారణకు ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది.