బిట్రగుంట వ్యవహారంపై జాతీయ బీసీ కమిషన్‌ విచారణ

ABN , First Publish Date - 2021-11-09T08:11:01+05:30 IST

ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటలో కుమ్మరి, శాలివాహన సొసైటీకి సంబంధించిన కట్టడాల తొలగింపుపై

బిట్రగుంట వ్యవహారంపై జాతీయ బీసీ కమిషన్‌ విచారణ

ఒంగోలు (క్రైం), నవంబరు 8 : ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటలో కుమ్మరి, శాలివాహన సొసైటీకి సంబంధించిన కట్టడాల తొలగింపుపై అందిన ఫిర్యాదు మేరకు జాతీయ బీసీ కమిషన్‌ సోమవారం హైదరాబాద్‌లో విచారణ చేపట్టింది. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎస్పీ మలికగర్గ్‌ కమిషన్‌ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. కె.బిట్రగుంటలోని శంభారెడ్డి కుంటలో 6.90 ఎకరాల స్థలాన్ని 1970లో అప్పటి కలెక్టర్‌ కత్తి చంద్రయ్య అక్కడి కుమ్మరి, శాలివాహన సొసైటీకి మంజూరు చేశారు. అప్పటి నుంచి సొసైటీ సభ్యులు ఆ కుంటలో మట్టిని తీసుకొని అక్కడే కుండలు తయారు చేసుకుంటున్నారు. ఈ ఏడాది జూన్‌లో రెవెన్యూ, పోలీసు అధికారులు జేసీబీతో ఆ గదులను తొలగించారు. దీనిపై సొసైటీ అధ్యక్షుడు ఏవీ. నరసింహం జాతీయ బీసీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.  


Updated Date - 2021-11-09T08:11:01+05:30 IST