సోము వీర్రాజుకు నారాయణ హెచ్చరిక

ABN , First Publish Date - 2021-12-31T21:13:02+05:30 IST

బీజేపీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలు చిత్తకార్తీ కుక్కల్లా తిరుగుతున్నారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

సోము వీర్రాజుకు నారాయణ హెచ్చరిక

తిరుపతి: బీజేపీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలు చిత్తకార్తీ కుక్కల్లా తిరుగుతున్నారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పిచ్చివాడి చేతికి ఏపీ బీజేపీని అప్పగించారని, ఆయన ఇంటిపేరు సారాయిగా మారిపోయిందన్నారు. బిచ్చగత్తే కంగనా రనౌత్ దారిలో బీజేపీ నడుస్తోందని దుయ్యబట్టారు. విప్పేసి ఆడే కంగనాకు పద్మశ్రీ.. రైతులకు సాయపడే సోనుసూద్‌పై ఐటీ దాడులా అని నారాయణ ప్రశ్నించారు. నోట్ల రద్దు తర్వాత బీజేపీ లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. సీపీఐ కార్యాలయాలపై మాట్లాడే అర్హత బీజేపీ నేత సోము వీర్రాజుకు లేదని నారాయణ హెచ్చరించారు.

Updated Date - 2021-12-31T21:13:02+05:30 IST