మాస్కు లేకుండా జగన్ ఏం సంకేతాలిస్తున్నారు?: నారా లోకేష్

ABN , First Publish Date - 2021-05-20T19:26:47+05:30 IST

అమరావతి: ఏపీ అసెంబ్లీలో నేడు ముఖ్యమంత్రి జగన్ సహా పలువురు మంత్రులు మాస్క్ లేకుండా కనిపించడం చర్చనీయాంశంగా మారింది.

మాస్కు లేకుండా జగన్ ఏం సంకేతాలిస్తున్నారు?: నారా లోకేష్

అమరావతి: ఏపీ అసెంబ్లీలో నేడు ముఖ్యమంత్రి జగన్ సహా పలువురు మంత్రులు మాస్క్ లేకుండా కనిపించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై తాజాగా ట్విటర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. మాస్క్ ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి అని ఫోటో, పేరుతో కోట్ల రూపాయ‌ల యాడ్స్‌ ఇచ్చిన జగన్ మాస్క్ ధ‌రించ‌కుండా ప్ర‌జ‌ల‌కు ఏం సంకేతాలిస్తున్నారని ప్రశ్నించారు. 


‘‘ముఖ్య‌మంత్రి గారూ! మాస్క్ ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి అని మీ ఫోటో, పేరుతో కోట్ల రూపాయ‌ల యాడ్స్‌ ఇచ్చిన మీరు మాస్క్ ధ‌రించ‌కుండా ప్ర‌జ‌ల‌కు ఏం సంకేతాలిస్తున్నారు. ముఖ్య‌మంత్రే మూర్ఖంగా మాస్క్ పెట్టుకోక‌పోతే, ఇక మంత్రులూ, ఎమ్మెల్యేలూ మాస్కులెందుకు ధ‌రిస్తారు? తొలి విడ‌త‌లో కోవిడ్ వైర‌స్ చిన్న‌పాటి జ్వ‌రం లాంటిదేన‌ని, పారాసెట‌మాల్ వేస్తే పోద్ది, బ్లీచింగ్ చ‌ల్లితే చ‌స్తుంది ..ఇట్ క‌మ్స్ ఇట్ గోస్.. ఇట్ షుడ్‌బీ నిరంత‌ర ప్ర‌క్రియ‌, స‌హ‌జీవ‌నం అంటూ ఫేక్ మాట‌ల‌తో వేలాది మందిని బ‌లిచ్చారు. సెకండ్‌వేవ్‌లో రాష్ట్రం శ్మ‌శానంగా మారుతుంటే చిరున‌వ్వులు చిందిస్తూ, మీరే మాస్క్ ధ‌రించ‌కుండా ఇంకెన్ని వేల‌మంది ప్రాణాలు ప‌ణంగా పెడ‌తారు? మాస్క్ లేకుండా మూర్ఖుడిగా ఉంటారో, మాస్క్ వేసుకుని మ‌నిషిన‌ని నిరూపించుకుంటారో మీ ఇష్టం’’ అని నారా లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2021-05-20T19:26:47+05:30 IST