దేవాన్ష్ పుట్టినరోజు.. లోకేశ్ ఉద్వేగం
ABN , First Publish Date - 2021-03-21T22:01:40+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు నేడు.

హైదరాబాద్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా లోకేశ్ ట్విటర్ వేదికగా తన చిట్టితండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన నాటి నుంచి తమ జీవితాలను వెలుగులమయం చేశాడని ట్విటర్‌లో పేర్కొన్నారు. వయసు పెరుగుతున్నా.. తనకింకా చిన్న పిల్లాడేనని, సంతోషాలను పంచుతున్నందుకు థాంక్య్ అంటూ ఉద్వేగభరితమైన ట్వీట్ చేశారు.