నేరుగా రా మాట్లాడదాం.. సీఎం జగన్కు లోకేశ్ సవాల్
ABN , First Publish Date - 2021-10-20T22:47:09+05:30 IST
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఫైర్ అయ్యారు. టీడీపీ కార్యాలయంపై ..

అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఫైర్ అయ్యారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడితో జగన్ నిజంగానే సైకో రెడ్డి అనిపించుకున్నారని ఆయన విమర్శించారు. పెంపుడు కుక్కలను తమపైకి పంపి తాడేపల్లి ఇంటిలో దాక్కున్న వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశారు. నేరుగా వస్తే మాట్లాడదామని, పోరాడదామని లోకేశ్ సవాల్ విసిరారు. ఎవరూ లేని సమయంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తే భయపడతామనుకుంటున్నారా అని లోకేశ్ వ్యాఖ్యానించారు. ‘‘ప్రతిపక్షం అడిగే ప్రశ్నకు దమ్ముంటే సమాధానం చెప్పాలి. లేనిపక్షంలో ఇంటికే పరిమితం కావాలి. ఏపీలో ఎప్పుడూ లేని విధంగా డ్రగ్స్, గంజాయి మాఫియా పెరిగింపోయింది.’’ అని లోకేశ్ ఆరోపించారు.