సొంత బ్రాండ్లపై ఉన్న ఆరాటం.. ప్రజల రక్షణపై లేదు: నారా లోకేష్
ABN , First Publish Date - 2021-05-08T20:10:32+05:30 IST
వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్‌పై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.

అమరావతి: వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్‌పై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్‌రెడ్డికి తన సొంత బ్రాండ్ల మద్యం అమ్మకంపై ఉన్న ఆరాటం.. ప్రజల ఆరోగ్యంపై లేకపోవడం విచారకరమన్నారు. తాగేవాడికి అనారోగ్యం, తాగించేవాడికి ఆదాయం వచ్చే మద్యంషాపుల ముందు మందుబాబులను జాగ్రత్తగా క్యూలలో పెట్టి, జగన్‌రెడ్డి భౌతికదూరం పాటించేలా చేస్తున్నారని చెప్పారు. ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలో జగన్ ఘోరంగా విఫలమయ్యారని.. ప్రజల ప్రాణాల రక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కోవిడ్ వ్యాప్తికి మరింత కారణం అవుతుందని నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.