జగన్ జాబురెడ్డి కాదు.. డాబు రెడ్డి: నారా లోకేష్

ABN , First Publish Date - 2021-06-21T21:16:03+05:30 IST

సీఎం జగన్ జాబురెడ్డి కాదు...డాబు రెడ్డి అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు.

జగన్ జాబురెడ్డి కాదు.. డాబు రెడ్డి: నారా లోకేష్

అమరావతి: సీఎం జగన్ జాబురెడ్డి కాదు...డాబు రెడ్డి అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. సోమవారం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. 2.3లక్షల ఉద్యోగాలిస్తానని చెప్పి జగన్ నిరుద్యోగ యువతను మోసగించారన్నారు. మాట తప్పినందుకు నిరుద్యోగులకు వైసీపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్‌తో నిరుద్యోగుల్లో నిరాశ, నిస్పృహలు పెరిగాయన్నారు. ఏపీపీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందన్నారు. గ్రూప్-1 పరీక్షల స్కామ్ మధ్యప్రదేశ్‌లో వ్యాపం స్కామ్ కన్నా పెద్దదని లోకేష్ చెప్పారు.  చైర్మన్ రూమ్‌కి తాళం వేసే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారు?అని ప్రశ్నించారు. గ్రూప్-1 అవకతవకలపై సీబీఐ విచారణ జరిపి నిజాలను నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘంగా చర్చించాకే అభ్యర్థుల తరపున న్యాయపోరాటానికి సిద్ధమయ్యామన్నారు. దొడ్డిదారిన ఉద్యోగాలు పొందిన వారు ఎలా పనిచేస్తారో అందరికీ తెలుసునన్నారు. అభ్యర్థులు అధైర్య పడొద్దు...కలసికట్టుగా పోరాడి విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు. సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి జోడెడ్ల బండిలాంటివని చెప్పారు. అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం వల్లే అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ కూరుకుపోయిందని  లోకేష్ అన్నారు. 

Updated Date - 2021-06-21T21:16:03+05:30 IST