‘అఖండ’ మూవీ చూశా.. ఎలా ఉందంటే..: చంద్రబాబు
ABN , First Publish Date - 2021-12-11T20:33:08+05:30 IST
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా వచ్చి హిట్ టాక్ తెచ్చుకున్న ‘అఖండ’ మూవీని తాను చూసినట్లు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు.
అమరావతి: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా వచ్చి హిట్ టాక్ తెచ్చుకున్న ‘అఖండ’ మూవీని తాను చూసినట్లు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. శనివారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన చంద్రబాబు ‘అఖండ’ సినిమా గురించి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అనేది ‘అఖండ’ సినిమాలో చూపించారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఏం జరుగుతోందో దాన్ని ‘అఖండ’ సినిమాలో చూపించారని, సినిమా చాలా బాగుందని చంద్రబాబు ప్రశంసించారు.